![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి కొత్తగా మారుతుంది. నిన్నంతా నామినేషన్ లో ఉన్నవారికి జరిగిన ఓటింగ్ లో శోభాశెట్టి, ప్రియాంక, టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత అయిదు రోజుల నుండి సాగుతున్న కెప్టెన్సీ రేస్ ఎట్టకేలకు ముగిసింది. ఇందులో ఫీమేల్ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.
'హాల్ ఆఫ్ ది బాల్' టాస్క్ లో గౌతమ్ టీమ్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచినట్టు ఇప్పటికే తెలిసింది. అయితే ఇప్పటికి జరిగిన టాస్క్ లలో చివరగా శోభాశెట్టి, టేస్టీ తేజ మధ్యలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో శోభాశెట్టి గెలిచింది. దీంతో తొమ్మిదో వారం కొత్త కెప్టెన్ గా శోభాశెట్టి ఎన్నిక అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్ లేడీ కెప్టెన్ గా శోభాశెట్టి ఎన్నికైంది. శోభాశెట్టితో మాట్లాడాలంటే భయపడుతున్న తోటి కంటెస్టెంట్స్ ఎలా భరిస్తారనేది చూడాలి. టేస్టీ తేజతో ఎప్పుడు ఒక ఫేక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్న శోభాశెట్టి వాళ్ల సీరియల్ బ్యాచ్ అయినటువంటి.. అమర్ దీప్, ప్రియంక జైన్ లకి ఫెయిర్ గా ఉంటుందా లేక అందరిని సపోర్టివ్ గా ఉంటుందా తెలియాలి.
ఇక గతవారం ఎలిమినేషన్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి ఈవారం కూడా ఉంది. టేస్టీ తేజ, శోభాశెట్టిల మధ్య తక్కువ ఓట్ల తేడాతో ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. అయితే నిన్న నమోదైన అనఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో అశ్వినిశ్రీకి లీస్ట్ లో ఉండగా.. నేడు అత్యధిక ఓటింగ్ తో ప్రియాంక కంటే ఒక స్థానం పైకి వచ్చి, తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది. ఇక హౌస్ లో ఎవరేం మాట్లాడినా వారి మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి కన్నింగ్ స్ట్రాటజీ, ఫౌల్ గేమ్ తో ప్రేక్షకులు విసుగుచెందినట్టుగా స్పష్టమవుతుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి చేస్తున్న ఫేక్ లవ్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. మరి కొత్తగా కెప్టెన్ అయిన శోభాశెట్టి ఎలిమినేట్ అయితే హౌస్ లో కెప్టెన్ ఎవరనే దానిపైన చర్చ జరుగుతుంది. ప్రేక్షకుల ఓటింగ్ ని ప్రధానంగా తీసుకొని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తారా లేక గతవారం చేసినట్టుగా మరో ఫేక్ ఎలిమినేషన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |